Carl Maersk: నేడు కార్ల్ మార్స్క్ 142వ వ‌ర్థంతి..! 1 y ago

featured-image

ఆయ‌న ఒక.. జర్మన్ శాస్త్రవేత్త

ఆయ‌న ఒక‌.. తత్త్వవేత్త

ఆయ‌న ఒక‌.. ఆర్థికవేత్త

ఆయ‌న ఒక‌.. సామాజికవేత్త

ఆయ‌నే కార్ల్ మార్స్క్‌..

కార్ల్ మార్క్స్ చ‌నిపోయి నేటికి 142 సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా, ఆయ‌న సిద్ధాంతాలు మాత్రం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనివి. నాడు ఆయ‌న చెప్పిన మాట‌లు, నేడు నిజ‌మ‌వుతున్నాయా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. బ‌ల‌హీన బ‌తుకుల‌పై బ‌ల‌వంతుల ఆగ‌డాలు పెరుగుతాయ‌ని, ప‌ని చేసే వాడిపై య‌జ‌మానులు పెత్త‌నాలు సాగిస్తార‌ని, శ్ర‌మ‌శ‌క్తిని కొల్ల‌గొట్టి సొంత ఆస్తులు కూడ‌గ‌ట్టుకుంటార‌ని కార్ల మార్స్క్ ఆ రోజుల్లోనే వాదించారు. నేడు జ‌రుగుతున్న ప‌రిణ‌మాలు చూస్తుంటే ఆయ‌న చెప్పిన మాట‌లు నిజ‌మే అని అర్థ‌మ‌వుతున్నాయి. బ‌డుగు బ‌ల‌హీనులు, పేద‌లు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింప‌డానికి కార్ల్ మార్క్స్‌ పోరాడారు. పెట్టుబ‌డీదారుల‌కు వ్య‌తిరేకంగా శ్ర‌మ‌శ‌క్తి జెండాను ఎగుర‌వేశారు కార్ల్ మార్స్క్‌.

కార్ల్ మార్క్స్.. జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఒక‌ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయ‌న రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్త వయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్‌లో జీవితం గడిపారు. లండన్‌లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి పలు పుస్తకాలు ప్రచురించారు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్టు మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. ఆ త‌రువాత కాలంలో మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.

సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తుంటారు. మార్క్స్ మరణించేంత వరకూ ఆయన భావాలు వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతాలు అనుగుణంగా చేశామని ప్రకటించుకున్నాయి. ఆ త‌రువాత 20వ శతాబ్ధంలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి. దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ప్ర‌పంచంపై కార్ల్ మార్క్స్ ప్ర‌భావం ఎంత ఉంది అనేది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD